News October 1, 2024
రాజధానిలో రూ.250 కోట్లతో టెక్నాలజీ యూనిట్

రాజధాని అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈఅ టెక్నాలజీ సెంటరును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులిచ్చింది. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీని సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సీఆర్డీఏ కమిషనరును కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సీఆర్డీఏ పరిధిలోని సుమారు 20ఎకరాల్లో టెక్నాలజీ సెంటరుకు త్వరలో పునాది పడనుంది.
Similar News
News July 9, 2025
మంగళగిరి: జనసేనలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు

జనసేన పార్టీలోకి ఆర్యవైశ్య ప్రముఖులు చేరారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్యసత్ర సముదాయం అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీకాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షుడు భవనాసి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారికి సాదరంగా స్వాగతం పలికారు.
News July 9, 2025
సైబర్ నేరాల నివారణకు చర్యలు: గుంటూరు ఎస్పీ

సైబర్ నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసు శాఖ, బ్యాంకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు రమణమూర్తి, సుప్రజ, పలువురు బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.
News July 9, 2025
తెనాలి: ఆలయ హుండీలో రద్దైన నోట్లు

వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ. 500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ.1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్‌బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది. జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి.