News July 26, 2024

రాజధాని ఏసీ బస్సుల ధరలకే ఈ గరుడ బస్సులు

image

TGSRTC E-గరుడ బస్సులను రాజధాని AC బస్సు ధరలోనే నడపాలని యజమాన్యం నిర్ణయించినట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు బుకింగ్ చేసిన ప్రయాణికులకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు, ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.

Similar News

News November 16, 2025

HYD: కులాంతర వివాహం.. పెట్రోల్ పోసి తగులబెట్టారు!

image

కులాంతర వివాహానికి సహకరించాడని హత్య చేసిన ఘటన షాద్‌నగర్‌లో జరిగింది. బాధితుల ప్రకారం.. ఎల్లంపల్లివాసి చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన యువతిని 10రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్ వివాహానికి అన్న రాజశేఖర్ సహకరించాడని భావించి యువతి బంధువులు 12న రాజశేఖర్‌ను మాట్లాడదామని పిలిచి కొట్టి హతమార్చారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 16, 2025

త్వరలో HYDలో ఎనిమీ ప్రాపర్టీ ప్రాంతీయ కార్యాలయం

image

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.

News November 16, 2025

చూద్దాం పదండి.. హైదరాబాద్ అందాలు

image

భాగ్యనగరం అంటే చార్మినార్‌, గోల్కొండ మాత్రమే కాదు. చరిత్ర సుగంధం వెదజల్లే అనేక అపూర్వ కట్టడాలకు ఆవాసమిది. సంస్కృతి, కళ, నిర్మాణ కౌశలాల సమ్మేళనం. శతాబ్దాల నాటి వారసత్వ సంపద నగరంలో ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాటి వెనుక కథలను వెలికితీసే ప్రయత్నమే ఇది. రోజూ ఓ చారిత్రక కట్టడం, ప్రముఖుల విశేషాలతో ‘హైదరాబాద్‌ అందాలు’ రానుంది. వారాంతాల్లో ఈ అందాలపై ఓ లుక్ వేయండి.<<18301143>> ఫలక్‌నుమా<<>>ప్యాలెస్ గురించి తెలుసుకుందాం.