News January 22, 2026

రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ: జగన్

image

AP: తమ వారి సంస్థలకు కారుచౌకగా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని YS జగన్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ‘రాజధానిలో నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచారు. ఒక్కో Sftకి ₹13 వేల వరకు చెల్లిస్తున్నారు. Sftకి ₹5 వేలతో ఫైవ్‌ స్టార్‌ హోటల్ నిర్మించొచ్చు. ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఇస్తూ దోపిడీ చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. బెల్టు షాపుల్లో మద్యం అక్రమ అమ్మకాలతో దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.

Similar News

News February 10, 2026

సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నారా?

image

రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ బిల్స్‌లో సర్వీస్ ఛార్జీ వసూలు చేయడం కన్జూమర్ లాను బ్రేక్ చేయడమేనని కేంద్ర వినియోగదారుల సంస్థ(CCPA) పేర్కొంది. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు తాజాగా దేశంలోని 27 రెస్టారెంట్లకు రూ.50వేల వరకు జరిమానా విధించినట్లు తెలిపింది. సర్వీస్ ఛార్జీ పూర్తిగా వినియోగదారుని ఇష్టమని, బలవంతంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. బాధితులు <>NCHలో<<>> ఫిర్యాదు చేయవచ్చు.

News February 10, 2026

CMపై భూకబ్జా ఆరోపణలు..రూ.500 కోట్లకు పరువు నష్టం దావా

image

రాష్ట్రంలో సుమారు 7,440 ఎకరాల భూమిని తాను, కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలను అస్సాం CM హిమంత బిశ్వ శర్మ ఖండించారు. తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగోయ్‌‌పై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు SM ద్వారా CM తెలిపారు. ఆధారాలు ఉంటే కోర్టులో నిరూపించాలని డిమాండ్ చేశారు.

News February 10, 2026

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌లో 376 పోస్టులు

image

న్యూఢిల్లీలోని <>నేషనల్<<>> ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ 376 సైంటిఫిక్/ టెక్నికల్ అసిస్టెంట్ -A పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MSc/MS/MCA/BE/BTech, GATE స్కోరు సాధించి వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.35,400-రూ.1,12,400 చెల్లిస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. సైట్: recruitment.nic.in