News March 12, 2025
రాజనీతి శాస్త్రంలో నిర్మల్ వాసికి డాక్టరేట్

నిర్మల్ పట్టణానికి చెందిన రాజనీతి శాస్త్ర లెక్చరర్ కొండా గోవర్ధన్ ఇటీవల హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో పొలిటికల్ అవేర్నెస్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ లీడర్‌షిప్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయనను పలువురు మిత్రులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్వామి, సాగర్‌రెడ్డి, మహేశ్, అశోక్ ఉన్నారు.
Similar News
News March 13, 2025
అసెంబ్లీని 20 రోజులు నడపాలని డిమాండ్: హరీశ్‌రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లుగా అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవడంపై అభ్యంతరం తెలిపామన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్‌ను బల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు.
News March 13, 2025
ODI WC-2027: రోహిత్ కీలక నిర్ణయం?

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ ఆడేందుకు ఫిట్‌నెస్, ఫోకస్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందుకు భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి ఆయన పని చేస్తారని టాక్. అభిషేక్ నుంచి బ్యాటింగ్, ఫిట్‌నెస్ టిప్స్ తీసుకుంటారని తెలుస్తోంది. కాగా IPLలో దినేశ్ కార్తీక్‌కు అభిషేక్ మెంటార్‌గా ఉన్నారు. ఆ సమయంలో DK చెలరేగి ఆడిన విషయం తెలిసిందే.
News March 12, 2025
అనకాపల్లి: 325 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షకు 325 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ బి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 10,136 మంది హాజరుకావాల్సి ఉండగా 9,905 మంది హాజరైనట్లు తెలిపారు. వోకేషనల్ కోర్సుకు సంబంధించి 2,345 మంది హాజరు కావలసి ఉండటం 2,251 మంది హాజరైనట్లు తెలిపారు.