News June 6, 2024

రాజన్నను దర్శించుకున్న SBI చీఫ్ జనరల్ మేనేజర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కార్పొరేట్ సెంటర్) చీఫ్ జనరల్ మేనేజర్ మంజు శర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

Similar News

News December 23, 2025

హుజూరాబాద్ నుంచి శబరిమలకి సూపర్ లగ్జరీ సర్వీస్

image

హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల అయ్యప్ప స్వామి భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది మకరజ్యోతి, మండల పూజల సందర్భంగా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం హుజూరాబాద్ నుంచి నేరుగా శబరిమలకి ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేసింది. జనవరి 12 సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సర్వీసులు హుజూరాబాద్ డిపో నుంచి బయలుదేరుతాయని మేనేజర్ పేర్కొన్నారు.

News December 23, 2025

REWIND: కరీంనగర్: రాజకీయ రణక్షేత్రం..!

image

ఈ ఏడాది జిల్లాలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గలేదు. సంవత్సరం ఆరంభంలో జరిగిన MLC ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడిచింది. చివరికి మేధావులు బీజేపీకి పట్టం కట్టారు. ఈ నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో సెగ పుట్టించాయి. ఈ ఎన్నికలు రాబోయే రాజకీయ పరిణామాలకు దిక్సూచిలా మారాయి. అధికార పార్టీకి గట్టి పోటీనిస్తూ BRS, BJPలు పోటాపోటీగా సీట్లు గెలుచుకోవడం జిల్లా రాజకీయాల్లో వేడిని పెంచింది.

News December 23, 2025

కరీంనగర్‌: ప్రాణదాతగా ‘108’ అంబులెన్స్‌ సేవలు

image

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘108’ అంబులెన్స్‌ సేవలు ప్రాణదాతగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు, గర్భిణీలను ఆసుపత్రులకు చేర్చడం, తదితర సేవలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. KNR జిల్లాలో ప్రస్తుతం 16 అంబులెన్సులు, 33మంది ఈఎంటీలు, 35 మంది పైలట్లు నిరంతరం అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. గత 20 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 56,171 మంది బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడటం విశేషం.