News August 29, 2025
రాజన్న ఆలయ ఈవోగా రమాదేవి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవోగా ఎల్.రమాదేవి నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న రమాదేవి.. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపినట్లు సమాచారం.
Similar News
News August 29, 2025
నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసే ముఠా అరెస్ట్: DSP

నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. కురవి మండలంలో రైతులను మభ్యపెట్టి, లోన్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి, ఒక్కో పాస్‌బుక్‌కు రూ.10,000 వసూలు చేసి, వివిధ బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తున్నట్లు తిరుగుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.16,90,000 లోన్లు మంజూరైనట్లు చెప్పారు.
News August 29, 2025
పెద్దపల్లి: ‘గ్రామ పంచాయతీ తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 2న విడుదల’

PDPL జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీ తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఆగస్టు 28న విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఆగస్టు 30లోపు అందజేయాలని కోరారు. వచ్చిన అభ్యంతరాలను ఆగస్టు 31లోపు పరిశీలించి తుది జాబితా రూపొందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
News August 29, 2025
సిరిసిల్ల: సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీ తుది ఓటర్ జాబితా ప్రచురణ

సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.