News December 30, 2025

రాజన్న కోడెలను రక్షించుకుందాం: ఇంఛార్జ్ కలెక్టర్

image

ప్లాస్టిక్ వినియోగం తగ్గించి రాజన్న కోడెలను రక్షించుకుందామని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. జాతర సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగంతో కోడెల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, స్థానిక వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సహకరించాలని కోరారు. సంబంధిత అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి ప్లాస్టిక్ విక్రయాన్ని అరికట్టాలన్నారు.

Similar News

News December 30, 2025

మోహన్‌లాల్ తల్లి కన్నుమూత

image

మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తల్లి శాంతాకుమారి(90) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతాకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మోహన్‌లాల్‌కు సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

News December 30, 2025

గరుడ గమన తవ విష్ణు స్తోత్రం రాసింది ఎవరో తెలుసా.?

image

ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాలయాలలో గరుడ గమన తవ.. చరణ కమల మిహా మనసిత సతు మల నిత్యం.. మహతాపము మా పా కురుదేవ.. మహా పాపమ మా పా కురుదేవ స్తోత్రం విస్తృతంగా వినపడుతుంది. ఈ మహా విష్ణు స్తోత్రాన్ని శృంగేరి శంకరమఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ భారతి తీర్థానంద స్వామి రచించారు. స్వామిజి పల్నాడు జిల్లాకు చెందినవారు. స్వామీజీ పల్నాడు జిల్లాలోనే విద్యాభ్యాసం చేశారు. ఇప్పటికీ నరసరావుపేటలో శృంగేరి శంకర మఠం ఉంది.

News December 30, 2025

నూతన ఏడాది కానుకగా పుస్తకాలు ఇవ్వండి: కృతికా శుక్లా

image

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న తనను కలవడానికి వచ్చే వారు పూలగుచ్ఛాలు, పండ్లు, స్వీట్లు, శాలువాలు తీసుకురావద్దని కలెక్టర్ కృత్తికా శుక్లా కోరారు. వాటికి బదులుగా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను విరాళంగా ఇవ్వాలని సూచించారు. సేకరించిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని లైబ్రరీలకు అందజేస్తామని తెలిపారు.