News November 17, 2024
రాజన్న కోవెలలో సామూహిక కార్తీక దీపోత్సవం
రాజన్న ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం సందర్భంగా వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాన అర్చకులు ఈశ్వరిగారి సురేశ్ ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు 2వ శనివారం నుంచి వచ్చే నెల 1 వరకు సామూహిక కార్తీక దీపోత్సవం చేస్తున్నారు. రేవతి, అనిత, సంకీర్తన బృందం వారిచే భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Similar News
News November 17, 2024
వేములవాడ రాజన్నను దర్శించుకున్న 50,796 మంది భక్తులు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం ఆదివారం పురస్కరించుకొని 50,796 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
News November 17, 2024
వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. పూజల వివరాలు ఇవే: ఈవో
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా భక్తుల సౌలభ్యార్థం అర్జిత సేవల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఈవో వినోద్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్వ దర్శనం, కోడె మొక్కుబడి, భక్తులచే నిర్వహించే అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2024
KNR: కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి!
కరీంనగర్ జిల్లాలో ఈ సమయానికి ధాన్యంతో కల కళకళలాడాల్సిన కొనుగోలు కేంద్రాలు వెలవెల బోతున్నాయి. రైతులు కోతలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కూడా తాలు పేరిట అధిక కాంట వేయడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారు. రైతులు నేరుగా రైస్ మిల్లర్లను ఆశ్రయించడంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.