News November 7, 2025
రాజన్న సిరిసిల్ల ఎస్పీ కార్యాలయంలో ‘వందేమాతరం’

వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయం గ్రౌండ్‌లో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బీ గితే వందేమాతరం ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News November 7, 2025
ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించండి: ఎస్పీ

పోలీస్ అంటే భయం కాదు.. నమ్మకం కలిగించేలా సిబ్బంది పనిచేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ పోలీస్ అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులను నిర్వహించి కఠిన చర్యలు చూసుకోవాలని సూచించారు.
News November 7, 2025
వరంగల్‌లో MRPS ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం

వరంగల్‌లో ఈరోజు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల కార్యవర్గ ఉమ్మడి జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 11వ తేదీన నిర్వహించబోయే చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేతలు కోరారు.
News November 7, 2025
వర్ధన్నపేట: వడ్లు ఆరబెట్టే యంత్రాలను రైతులు వినియోగించుకోవాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డ్రై హెడ్ మిషన్ (వడ్లు అరబెట్టే యంత్రం)లను రైతులు వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సూచించారు. వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. యంత్రాల ద్వారా వడ్లను ఎలా ఆరబెట్టుకోవాలో రైతులకు అవగాహన కల్పించి, ఆధునిక పద్ధతులపై సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.


