News March 31, 2025
రాజన్న సిరిసిల్ల: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
Similar News
News April 3, 2025
ఎమ్మెల్సీగా ప్రమాణం.. పవన్ కళ్యాణ్‌ను కలిసిన నాగబాబు

AP: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన నేత నాగబాబు విజయవాడలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. నాగబాబుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. నిన్న నాగబాబు సీఎం చంద్రబాబు, తన సోదరుడు చిరంజీవితో భేటీ అయ్యారు.
News April 3, 2025
అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తి

అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం టిడి బంజరలో షార్ట్ సర్క్యూట్ కారణంగా <<15975525>>అగ్నిప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో రెండు ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఓ ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) మంటలు అంటుకొని సజీవదహనం అయ్యాడని స్థానికులు చెప్పారు. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. పంచాయతీ ట్రాక్టర్‌తో మంటలను అదుపు చేశామన్నారు.
News April 3, 2025
ఆదిలాబాద్: KU.. గడువు మరోసారి పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.