News February 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పట్టభద్రులు 22,397 మంది (5.2 శాతం), ఉపాధ్యాయులు 950 మంది (11.52 )శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News February 27, 2025
న్యూజిలాండ్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?

CT: మార్చి 2న NZతో మ్యాచులో IND కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వొచ్చని క్రీడా వర్గాలు తెలిపాయి. అతని స్థానంలో వైస్ కెప్టెన్ గిల్ కెప్టెన్సీ చేస్తారని పేర్కొన్నాయి. PAKతో మ్యాచులో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డారు. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఆయన యాక్టివ్‌గా పాల్గొనలేదు. దీంతో NZతో మ్యాచుకు హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చి రాహుల్‌ను ఓపెనర్‌గా, పంత్‌ను WKగా ఆడిస్తారని వార్తలొస్తున్నాయి.
News February 27, 2025
చిరుత కళేబరానికి పోస్టుమార్టం పూర్తి

శ్రీశైలం క్షేత్ర పరిధి రుద్రపార్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం మృతి చెందిన చిరుత కళేబరానికి గురువారం వైల్డ్ లైఫ్ డాక్టర్లు అరుణ్ వెస్లీ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. తొలుత అనుమానాస్పద స్థితిలో చిరుత మరణించినట్లు అటవీ అధికారులు భావించినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టులో మానవ ప్రమేయం లేనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తదుపరి పలు నమూనాలను లేబరేటరీకి పంపించినట్లు అటవీ అధికారులు తెలిపారు.
News February 27, 2025
జూ పార్క్ టికెట్ ధరలు భారీగా పెంపు

TG: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వివిధ టికెట్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 ఉండగా.. ఇక నుంచి రూ.100, రూ.50 వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ట్రైన్ రైడ్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ వెహికల్ రైడ్ ధర రూ.120 అని తెలిపారు. అలాగే పార్కింగ్ ధరలు సైతం పెంచారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్నారు.