News August 15, 2025

‘రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తుంది’

image

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఘా జాతీయ జెండాను ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళుతుందన్నారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News August 15, 2025

జీరో ఫేర్‌ టికెట్‌.. అమ్మా జర్నీ ఫ్రీ!

image

అనంతపురం జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. బుక్కరాయసముద్రం ఆర్టీసీ బస్టాండ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని MP లక్ష్మీనారాయణ, MLA శ్రావణి ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో.. ఆధార్‌, రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒకటి చూపించి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. జిల్లాలో 402 బస్సులను ఫ్రీ జర్నీకి కేటాయించారు.

News August 15, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: అల్పపీడనం ప్రభావంతో రేపు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. అటు, కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సా.5 గంటలకు 2,98,209 క్యూసెక్కులుగా ఉందని వెల్లడించింది.

News August 15, 2025

కరీంనగర్: ‘ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది’

image

కరీంనగర్‌లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.