News September 12, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతమిలా..

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాత నమోదు వివరాలు శుక్రవారం ఇలా ఉన్నాయి. రుద్రంగి 11.1, చందుర్తి 3.1, వేములవాడ రూరల్ 8.7, బోయిన్పల్లి 6.4, వేములవాడ 7.8, సిరిసిల్ల 16.7, కొనరావుపేట 5.9, వీర్నపల్లి 4.3, ఎల్లారెడ్డిపేట 30.0, గంభీరావుపేట 23.0, ముస్తాబాద్ 23.8, తంగళ్లపల్లి 25.6, ఇల్లంతకుంటలో 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News September 12, 2025

విశాఖ రానున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

image

రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం విశాఖ రానున్నారు. శనివారం ఉదయం 8గంటలకు ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం రాత్రికి విశాఖలో బస చేస్తారు. ఆదివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 2గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ వెళ్తారు. దీనికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 12, 2025

HYD: మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్!

image

నగర వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా HYD పోలీసులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని, అందరూ దీనికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. భారీ వర్షం కురిసే సమయంలో కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, హెవీ ట్రిఫిక్ ఉండే రోడ్లు అవాయిడ్ చేయాలని సూచించారు.

News September 12, 2025

అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ పోలీసులు

image

అపరిచితులతో ఫోన్ కాల్స్, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అపరిచితులతో న్యూడ్ వీడియో కాల్స్‌లో పాల్గొనవద్దని, అలా ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యాశతో మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించారు.