News September 12, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా.. వర్షపాతమిలా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న ఉ.8.30 గంటల నుంచి ఇవాళ ఉ.6 గంటల వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో అత్యధికంగా 35.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు శుక్రవారం తెలిపారు. ముస్తాబాద్ 30.5 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 29.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గంభీరావుపేట 26.3, ఇల్లంతకుంటలో 19.8 మిల్లీమీటర్ల వర్షం పడగా, కొన్ని మండలాల్లో మాత్రం తేలికపాటి వర్షాపాతం నమోదైంది.
Similar News
News September 12, 2025
‘అన్నమయ్య కలెక్టర్ సేవలు మరువలేనివి’

అన్నమయ్య జిల్లాకు ఒక సంవత్సరంలో మూడు నెలల కాలంలో కలెక్టర్ చామకూరి శ్రీధర్ అనేక రకాలుగా సేవలు అందించారని గాజుల ఖాదర్ బాషా పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాకు గౌరవ కలెక్టర్ చామకూరి శ్రీధర్ విశిష్ట సేవలు అందించి మంచి కలెక్టర్‌గా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని అన్నారు. నేడు కలెక్టర్ బదిలీ కారణంగా అందరికీ బాధగా ఉందని అయన తెలిపారు.
News September 12, 2025
BIG ALERT: రేపు అతిభారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News September 12, 2025
చిత్తూరు జిల్లాలోని ఈ మండలాల్లో రేపు పవర్ కట్

జిల్లాలోని వివిధ మండలాలలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు EE మునిచంద్ర పేర్కొన్నారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల, యాదమరి, ఐరాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు మండలాలలో సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.