News January 28, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పది మండలాలలో కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట 12.8, రుద్రంగి 13.8, తంగళ్ళపల్లి 13.9, వీర్నపల్లి 14.1, కోనరావుపేట 14.2, వేములవాడ రూరల్ 14.3, బోయిన్‌పల్లి 14.4, చందుర్తి 14.6, కొనరావుపేట 14.7, ముస్తాబాద్ 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయయ్యాని వాతావరణశాఖ తెలిపింది.

Similar News

News December 25, 2025

NGKL: షెడ్యూల్ తెగల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి

image

జిల్లాలోని షెడ్యూల్ తెగల విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎస్టి ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో ఐదో తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న ఎస్టీ విద్యార్థులు, 9వ,10వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News December 25, 2025

TRAIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<>TRAI<<>>) 6 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/BTech (E&C Engg., CS&IT, డేటా సైన్స్&AI) ఉత్తీర్ణతతో పాటు GATE- 2023/2024/2025 స్కోరు గలవారు JAN 4 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.trai.gov.in

News December 25, 2025

నల్గొండ: ‘యాప్‌లో ఒక్క యూరియా బస్తా కూడా లేదు’

image

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో నల్గొండ జిల్లా నిడమానూరు మండలం పరిధిలో ఒక్క యూరియా బస్తా కూడా చూపించడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించాలని, తమకు బుకింగ్ ఎలా చేసుకోవాలనేది తెలియడం లేదని వాపోయారు. జిల్లాలో స్టాక్ అందుబాటులో ఉందంటున్నారు కానీ ఏ సెంటర్‌లో స్టాక్ ఉందో కనిపించడం లేదన్నారు. కౌలు రైతులకు కూడా బుకింగ్ ఇబ్బందిగా ఉందన్నారు.