News December 14, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ ఎంతంటే? …

జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో 20.27 శాతం పోలింగ్ నమోదయింది. బోయినపల్లి మండలంలో 18.25%, ఇల్లంతకుంట మండలంలో 23.81%, తంగళ్ళపల్లి మండలంలో 18.57% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,04,905 మంది ఓటర్ల గాను 21,268 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News December 16, 2025
FLASH.. ములుగు: మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్ నుంచి సేఫ్ జోన్‌కు వెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. పట్టుబడ్డ బడే చొక్కారావుతోపాటు 15 మంది మావోయిస్టులు సిర్పూర్(యూ)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉండగా, మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు.
News December 16, 2025
‘పోలవరం-నల్లమలసాగర్’పై SCలో TG పిటిషన్

AP చేపట్టనున్న పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై TG ప్రభుత్వం SCలో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని నిలువరించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. గోదావరి నీటి తరలింపుతో TGకి నష్టం వాటిల్లుతుందని తెలిపింది. కాగా ఈ ప్రాజెక్టుపై AP ఇప్పటికే SCలో కేవియెట్ పిటిషన్ వేసింది. గతంలో ‘పోలవరం-బనకచర్ల’ DPRను TG అభ్యంతరంతో కేంద్రం వెనక్కు పంపింది. తాజాగా దానిని కొంత సవరించి తాజా లింకు ప్రాజెక్టుకు AP నిర్ణయించింది.
News December 16, 2025
MNCలు కాదు.. చిన్న కంపెనీలే మంచివి

AI రంగంలో జాబ్ కోరుకునేవారు MNCల కంటే చిన్న, మధ్య తరహా కంపెనీలను ఎంచుకోవాలని US బిలియనీర్ మార్క్ క్యూబన్ యువ ఇంజినీర్లకు సలహా ఇచ్చారు. చిన్న సంస్థల్లో వ్యక్తిగత ప్రతిభ చూపేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని, పెద్ద కంపెనీల్లో అలా కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం AIలో ఇన్వెస్ట్ చేసిన చాలా కంపెనీలకు లాభాలు రావట్లేదని, అయితే స్టార్టప్‌లు ముందంజలో ఉన్నాయన్నారు. యువత AI నేర్చుకోవడం ఎంతో అవసరమని సూచించారు.


