News December 26, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బదిలీ..!

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎం.హరిత బదిలీ అయ్యారు. చాలారోజులుగా సెలవులో ఉన్న ఆమెను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దివారాలుగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌ను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్(పూర్తి అదనపు బాధ్యతలు)గా కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Similar News

News December 27, 2025

నేచురల్ AC కారిడార్‌‌గా మూసీ!

image

మూసీ పునరుద్ధరణలో ప్రభుత్వం ఇప్పుడు సింగపూర్ ‘ABC’ (Active, Beautiful, Clean) మంత్రాన్ని జపిస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. మూసీని కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా నగరాన్ని చల్లబరిచే ఒక భారీ ‘నేచురల్ AC’ కారిడార్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నదికి ఇరువైపులా అత్యాధునిక ‘వర్టికల్ ఫారెస్ట్స్’ పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.

News December 27, 2025

STU రాజంపేట రీజనల్ కన్వీనర్‌గా రవిశంకర్

image

స్టేట్ టీచర్స్ యూనియన్(STU) రాజంపేట రీజనల్ కన్వీనర్‌గా రవిశంకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన నల్లపరెడ్డి పల్లి జడ్పీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

News December 27, 2025

ఈనెల 28న పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి పర్యటన

image

ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైనవానిలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.