News January 26, 2026
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా గణతంత్ర వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, అన్ని మండలాల తహసిల్దార్ కార్యాలయాల్లో ఎమ్మార్వోలు, పోలీస్ స్టేషన్లలో ఎస్సైలు జెండా ఆవిష్కరించారు. మండల పరిషత్‌లో ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండా ఎగరవేశారు. అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు నివాళులర్పించారు.
Similar News
News January 26, 2026
భీమేశ్వరాలయంలో ఇది తాజా పరిస్థితి

వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి కోడె మొక్కులు చెల్లించుకొని అందరినీ చల్లంగా చూడు స్వామి అని వేడుకున్నారు. మేడారం జాతర సమీపిస్తున్న తరుణంలో భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
News January 26, 2026
అంబేడ్కర్ యూనివర్సిటీలో 53పోస్టులకు నోటిఫికేషన్

ఆగ్రాలోని <
News January 26, 2026
రేపు మధ్వనవమి.. ఎందుకు జరుపుతారంటే?

ద్వైత సిద్ధాంతకర్త, వాయుదేవుని మూడో అవతారమైన మధ్వాచార్యులు భౌతిక దేహంతో బదరీ క్షేత్రానికి పయనమైన పవిత్ర దినమే మధ్వనవమి. మాఘ శుక్ల నవమి నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో శిష్యులకు పాఠం చెబుతుండగా పుష్పవృష్టి కురిసి అదృశ్యమయ్యారు. హరియే సర్వోత్తముడని చాటిచెప్పిన ఆయన స్మరణార్థం నేడు మధ్వనవమి జరుపుకొంటాం. లోకానికి జ్ఞాన, భక్తి మార్గాలను అందించిన మహనీయుని పట్ల కృతజ్ఞతగా ఆయనకు విశేష పూజలు నిర్వహిస్తారు.


