News January 29, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత ఉన్న మండలాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు మండలాలకు చలి తీవ్రత ఉన్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. గంభీరావుపేట 13.5, బోయిన్పల్లి 14. 2, తంగళ్ళపల్లి 14.5, రుద్రంగి 14.7, వేములవాడ రూరల్ 14.8, వీర్నపల్లి 14.9, కోనరావుపేట 14.9గా టెంపరేచర్ నమోదయ్యింది. ఈ 7 మండలాలకు చలి తీవ్రత ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు.
Similar News
News November 13, 2025
మేడారం.. రాజకీయ విమర్శలకు కేంద్రం..!

ఎవ్వరికి ఎవ్వరు తగ్గడం లేదు. దగ్గరలో ఎన్నికలేవీ లేకున్నా ములుగు జిల్లాలో రాజకీయం సలసల కాగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇందుకు మేడారం కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనదేవతల గద్దెల విస్తరణ, అభివృద్ధి పనులను నాసిరకం, నిర్లక్ష్యం అంటూ బీఆర్ఎస్ నేత నాగజ్యోతి ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి సీతక్క ‘చిల్లర విమర్శలు’ అంటూ నిన్న గట్టిగా తిప్పికొట్టారు.
News November 13, 2025
39పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 39 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ, CA/ICWAI, డిప్లొమా, బీఎస్సీ(MPC), ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష(CBT), ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bvfcl.com/
News November 13, 2025
ప్రతి ఒక్కరూ వేదాలను ఎందుకు చదవాలి?

వేదాలు దైవిక నాదస్వరూపాలు. వీటిని రుషులు లోకానికి అందించారు. ఇవి మంత్రాల సముదాయం మాత్రమే కాదు. మనిషి జీవితానికి మార్గదర్శకాలు కూడా! ఇవి మనల్ని అసత్యం నుంచి సత్యానికి నడిపిస్తాయి. చీకటి నుంచి వెలుగు వైపుకు తీసుకెళ్తాయి. మృత్యువు నుంచి మోక్షం వైపుకు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తాయి. నిత్య జీవితంలో ధైర్యాన్ని, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి వేదాలు తోడ్పడతాయి. <<-se>>#VedikVibes<<>>


