News November 26, 2025

రాజన్న హుండీ ఆదాయం రూ. 94,29,209/-

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి హుండీ ద్వారా రూ 94,29,209/- ఆదాయం సమకూరింది. గత వారం రోజుల ఆదాయాన్ని బుధవారం లెక్కించగా నగదు రూపంలో రూ.94,29,209/-, మిశ్రమ బంగారం 067 గ్రాముల 500 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోలు లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ సిబ్బంది, వాలంటీర్లు లెక్కింపులో పాల్గొన్నారు.

Similar News

News November 27, 2025

తిరుపతి: కల్తీ నెయ్యి కేసులో 9కి చేరిన అరెస్టులు.!

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ 8 మందిని అరెస్టు చేయగా.. గురువారం 9వ అరెస్టు చేసింది. పొమిలి జైన్, విపిన్ జైన్, రాజశేఖరన్, అపూర్వ చావడి, హరి మోహన్ లాల్ రాణా, ఆసిస్ అగర్వాల్, చిన్న అప్పన్న, అజయ్ కుమార్ సుగంధ్, సుబ్రహ్మణ్యం అరెస్టు అయ్యారు. కేసులోని పలువురు ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు. పూర్వపు ప్రొక్యూర్ మెంట్ జీఎంకు రాత్రి 7 లోపు కోర్టులో రిమాండ్ విధించే అవకాశం ఉంది.

తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

image

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.