News September 6, 2025

రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు

image

వినాయక నిమజ్జనం దృష్ట్యా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు గోదావరి గట్టు వైపుగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. అంబేద్కర్ సర్కిల్, కోటగుమ్మం, పొట్టి శ్రీరాములు బొమ్మ, దోబీ ఘాట్, కుమారి టాకీస్ వంటి ప్రధాన రహదారులపై కేవలం వినాయక విగ్రహాల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కోరారు.

Similar News

News September 6, 2025

జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శనివారం తెలిపారు. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 21 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని వెల్లడించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియాను అందుబాటులో ఉంచామని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.

News September 6, 2025

గోదావరి నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

image

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి 9,00,814 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.20 అడుగులకు చేరిందని, ఎగువ ప్రాంత ప్రవాహాలు తగ్గుముఖం పట్టడంతో నీటి స్థాయి క్రమంగా తగ్గుతుందన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 12,700 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నామని తెలిపారు.

News September 5, 2025

రాజమండ్రి: జిల్లాలో 87 మంది ఉపాధ్యాయులకు అవార్డులు

image

జిల్లా పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆనం కళాకేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొత్తం 87 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ గ్రేడ్ టీచర్స్, ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను వారు కొనియాడారు.