News September 8, 2025

రాజమండ్రిలో నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

image

రాజమండ్రిలో నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథాతదంగా జరగనుందని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు నేరుగా సమర్పించుకోవచ్చుని అన్నారు. అర్జీలు ముందుగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News September 8, 2025

బిక్కవోలు: భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

భార్య కాపురానికి రాలేదని ఓ వ్యక్తి మనస్తాపం చెంది కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం బిక్కవోలులో జరిగింది. ఎస్సై రవివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కవోలుకు చెందిన రవికుమార్‌కు సోనితో వివాహమైంది. 3 నెలల కిందట భర్తపై కోపంతో మండపేటలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో రవి సామర్లకోట కాలువలో దూకాడు. అదే మార్గంలో వెళ్లున్న ఎస్సై, డ్రైవర్ అతనిని కాపాడారు.

News September 8, 2025

కడియం: అమోనియా, నానో యూరియాలను రైతులు వాడుకోవాలి

image

కడియం, రాజమండ్రి రూరల్ మండలంలో తూ.గో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నేతల మల్లికార్జున రావు ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాలను ఆదివారం పరిశీలించారు. రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియా తగు పరిమాణంలోని మాత్రమే వాడాలని అధికంగా వాడితే పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుందని వారికి చెప్పారు. అమోనియా, నానో యూరియాలను రైతులు తమ పొలంలో వాడుకొని పెట్టుబడి తగ్గించుకోవాలన్నారు.

News September 7, 2025

వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి: ఎస్పీ

image

వినాయక చవితి వేడుకలు, మిలాద్ – ఉన్ – నబీ వేడుకలు జిల్లాలో శాంతియుతంగా జరిగాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ పండుగలు మత సామరస్యాన్ని చాటి చెప్పాయన్నారు. విజయవంతంగా వేడుకలు నిర్వహించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. సహకరించిన కమిటీలు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.