News June 15, 2024

రాజమండ్రిలో ఫ్లైఓవర్ కింద 2 మృతదేహాలు

image

రాజమండ్రి సిటీలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శంభూనగర్ ఫ్లై ఓవర్ కింద శనివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు మృతి చెంది ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. వీరిద్దరూ సోదరులని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News October 2, 2024

రాజమండ్రి: ‘చమురు సంస్థల నుంచి పరిహారం ఇప్పించాలి’

image

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో విజయవాడలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భేటీ అయ్యారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని సముద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న పలువురు మత్స్యకారులకు చమురు సంస్థలు నుంచి పరిహారం కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులందరికి పరిహారం ఇప్పించాలని కోరారు.

News October 2, 2024

తూ.గో.: నేడు యథావిధిగా పనిచేయనున్న విద్యాసంస్థలు

image

తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం తెలిపారు. దసరా సందర్భంగా మూడవ తేదీ గురువారం నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గత నెల 2న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో దాన్ని భర్తీ చేసేందుకు బుధవారం విద్యా సంస్థలకు సెలవు రద్దు చేసినట్లు తెలిపారు.

News October 2, 2024

కాకినాడలో మూడుసార్లు పర్యటించిన మహాత్మా గాంధీ

image

స్వాతంత్రోద్యమకాలంలో మహాత్మాగాంధీ కాకినాడలో మూడుసార్లు పర్యటించారు. 1921 ఏప్రిల్‌ 3న కాకినాడలో గాంధీజీ దంపతులు, వారి నాలుగో కుమారుడు రైలు దిగారు. గుర్రపు బండిపై పెద్ద బజారు గుండా జగన్నాథపురంలోని పైడా వెంకట నారాయణ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత 1930, 1933లలో రెండుసార్లు కాకినాడ వచ్చిన గాంధీ స్వాతంత్రోద్యమ సభల్లో పాల్గొన్నారు. ఈ విధంగా ఆయనకు తూర్పు గోదావరి జిల్లాతో సంబంధం ముడిపడి ఉంది.