News September 6, 2024
రాజమండ్రిలో యాక్సిడెంట్.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి

రాజమండ్రిలోని దివాన్ చెరువు వైపునకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన కార్తీక్ (19)గా గుర్తించారు. మృతులు గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 22, 2025
రాజమండ్రి: కాశీ నవీన్ కుమార్‌ను సత్కరించిన జవహర్

తూ.గో జిల్లా TDP ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాశీ నవీన్‌కుమార్‌ను ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం రాజమండ్రిలోని R&B గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఈభేటీలో నవీన్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పార్టీని నమ్ముకుని పనిచేసే సీనియర్ నాయకులకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని, నవీన్ నియామకమే ఇందుకు నిదర్శనమని జవహర్ కొనియాడారు.
News December 22, 2025
బీజేపీతోనే సుపరిపాలన సాధ్యం: MP పురందీశ్వరి

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని MP పురందీశ్వరి అన్నారు. అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా సోమవారం రాజమండ్రిలోని తన కార్యాలయం వద్ద ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా సుపరిపాలన అందుతోందని పేర్కొన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
News December 22, 2025
బీచ్ వాలీబాల్‌లో మెరిసిన తూ.గో కుర్రాళ్లు

బాపట్లలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో దుద్దుకూరుకు చెందిన మల్లిపూడి చందు, తాడిపూడికి చెందిన వేములూరు కార్తీక్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్థులు వీరిని ఘనంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తామని యువకులు ధీమా వ్యక్తం చేశారు.


