News March 16, 2025
రాజమండ్రి: అమెరికా నుంచి వచ్చానని అమ్మాయిలకు వల

అమ్మాయిలను మ్యాట్రిమోనీ, షాదీ డాట్‌కాం ద్వారా మోసగిస్తున్న రాజమండ్రికి చెందిన వంశీకృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అమెరికా నుంచి వచ్చానని, ఎన్నారైలను, రెండో పెళ్లికోసం చూస్తున్న వారి వద్ద డబ్బులు కాజేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగిన వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. వంశీపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి.
Similar News
News September 17, 2025
జగిత్యాల: నవంబర్‌లో డీఈఐఈడీ, డీపీఎస్ఈ పరీక్షలు

2024-26 బ్యాచ్‌కు చెందిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లోమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ లో నిర్వహించబడతాయని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. లేట్ ఫీజు లేకుండా ఈనెల 22లోగా ప్రిన్సిపల్‌కు ఫీజులు చెల్లించవచ్చన్నారు. 50 రూపాయల లేట్ ఫీజ్ తో ఈనెల 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. ఆన్లైన్ లో అయితే లేట్ ఫీజు లేకుండా 23లోగా లేట్ ఫీజు తో 30లోగా చెల్లించాలన్నారు.
News September 17, 2025
NZB: జాతీయ పతాకాన్ని ఎగరవేసిన CM సలహాదారు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని వివరించారు. కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, CP సాయి చైతన్య, MLAలు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
News September 17, 2025
వీరుల త్యాగానికి సాక్షిగా పాలకుర్తి!

తెలంగాణ ప్రజాస్వామ్య పోరాట కేంద్రంగా పాలకుర్తి పేరొందింది. చాకలి ఐలమ్మ, చౌదవరపు విశ్వనాధం వంటి వీరులు దొరల పాలన, నిజాం సవరణకు వ్యతిరేకంగా పోరాడి ఈ ప్రాంతానికి చరిత్రాత్మక ఘట్టాలు అందించారు. గూడూరు గ్రామం 20 మంది స్వాతంత్ర్య సమరయోధులను అందించింది. వీరి త్యాగాలు, సమర్పణలు పాలకుర్తిని ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిపాయి.