News March 12, 2025

రాజమండ్రి: ఆ రైళ్లు సికింద్రాబాద్ వెళ్లవు..!

image

సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు ముమ్మరం కావడంతో స్టేషన్‌కు వచ్చే 14 ముఖ్యమైన రైళ్ల రూటును మార్చేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. లింగంపల్లి- కాకినాడ స్పెషల్ (07445/07446) ఏప్రిల్ 2 నుంచి, లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806) ఏప్రిల్ 25 నుంచి సికింద్రబాద్‌కు రాకుండానే చల్లపల్లి మీదుగా నడుస్తాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.

Similar News

News December 8, 2025

బొమ్మూరు: స్టార్టప్‌ ఐడియా ఉందా? రండి.. ‘స్పార్క్‌’ చూపిద్దాం!

image

నూతన ఆవిష్కరణలు, వినూత్న వ్యాపార ఆలోచనలు ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 9 నుంచి 11 వరకు ‘స్పార్క్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ వై. మేఘ స్వరూప్‌తో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో జరిగే శిక్షణలో నిపుణులు దిశానిర్దేశం చేస్తారన్నారు. నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.

News December 8, 2025

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించండి: తూ.గో. ఎస్పీ

image

తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 32 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ బాధితుల నుంచి స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. బాధితుల ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. PGRS అర్జీల పరిష్కారంలో జాప్యం వహించరాదని ఆయన స్పష్టం చేశారు.

News December 8, 2025

తూ.గో: టెన్త్ విద్యార్థులకు సూచన

image

డిసెంబర్ 9 లోపు టెన్త్ పరీక్షా ఫీజు చెల్లించాలని డీఈవో వాసుదేవరావు తెలిపారు. జిల్లాలో టెన్త్ మార్చి -2026లో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ /2025 ఫెయిల్ అయిన విద్యార్థులు గమనించాలన్నారు. 10 – 12వ తేదీ లోపు రూ.50, 13-15వ తేదీ వరకు రూ.200, 16 – 18 వరకు రూ.2,500 ఫైన్‌తో చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్కూల్ లాగిన్ ద్వారానే ఫీజ్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.