News February 3, 2025
రాజమండ్రి: ఇంటర్ యువతిపై లెక్చరర్ అత్యాచారం

ఇంటర్ అమ్మాయిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్‌వర్ధన్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News October 29, 2025
శాతవాహన ఎక్స్‌ప్రెస్.. జనగాంలో అదనపు స్టాప్

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగాం స్టేషన్‌లో అదనపు స్టాప్ ప్రకటించింది. ప్రయోగాత్మకంగా అక్టోబర్ 30, 2025 నుంచి అమల్లోకి రానుంది. విజయవాడ- సికింద్రాబాద్ ఉ.10:14, సికింద్రాబాద్- విజయవాడ సా.17:19కి జనగాం చేరుకొని, నిమిషం పాటు వెయిట్ చేస్తుందని పేర్కొంది.
News October 29, 2025
GNT: 39 మంది గర్భిణులను జీజీహెచ్‌కు తరలింపు

‘మొంథా’ తుపాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. సోమవారం, మంగళవారం రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 39 మంది గర్భిణులను సురక్షితంగా GNT GGHకు తరలించారు. తరలించిన గర్భిణులలో అచ్చంపేట, కారంపూడి, పెదకూరపాడు, దుగ్గిరాల ప్రాంతాలకు చెందిన మహిళలు ఉన్నారు. 24 గంటల విద్యుత్‌కు అంతరాయం కలగకుండా, 8 జనరేటర్లకు సరిపడా ఇంధనాన్ని సిద్ధం చేశారు.
News October 29, 2025
బాత్రూమ్‌లో ఈ తప్పులు చేయకండి!

బాత్రూమ్‌లో స్నానం చేసేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
*బాత్రూంలో ఫోన్ వాడొద్దు.
*మూత తెరిచి ఫ్లష్ చేస్తే వ్యాధికారక క్రిములు వ్యాపిస్తాయి.
*ఎక్కువ సేపు కమోడ్‌పై కూర్చుంటే పైల్స్ రావచ్చు.
*రోజూ వేడి నీటి స్నానం చర్మాన్ని పొడి బారుస్తుంది.
*ఎక్కువ సబ్బు వాడటం చర్మానికి హానికరం.
*బలంగా టవల్‌తో రుద్దితే అది చర్మానికి నష్టం కలిగిస్తుంది. Share it


