News February 2, 2025

రాజమండ్రి: ఇంటిపై దాడిని ఖండించిన ముద్రగడ కుమార్తె

image

తన తండ్రి మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె జనసేన నాయకురాలు బార్లంపూడి క్రాంతి తెలిపారు. రాజమండ్రిలో ఆమె పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నాన్న ఇంటిపై దాడి జరగడం చాలా బాధాకరమన్నారు. డిప్యూటీ సీఎం ఇటువంటి దాడులకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి జనసేన నాయకులు చేయించారని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.

Similar News

News February 2, 2025

రాజమండ్రి: ఎమ్మెల్సీగా అఖండ మెజార్టీతో గెలిపించండి

image

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో తనను గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కోరారు. శనివారం రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

News February 1, 2025

రాజమండ్రిలో వ్యక్తి మృతి

image

రాజమండ్రి రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన తీపర్తి బుల్లిబాబు(45) కాకినాడ GGHలో శుక్రవారం మృతి చెందాడు. బొమ్మూరు ఎస్సై అంకారావు వివరాల మేరకు.. ఈనెల 26న బుల్లిబాబు భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడిగాడు. ఆమె డబ్బులు లేవనిచెప్పడంతో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యానికి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మ‌ృతి చెందాడు.

News February 1, 2025

పా.గో : సర్పంచ్ పేరుతో అపరిచిత వ్యక్తుల దరఖాస్తులు

image

పా.గో జిల్లాలోని మండల కేంద్రమైన తాళ్లపూడి సర్పంచ్ లాగిన్‌లో అపరిచిత వ్యక్తులు ప్రధాని మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తులు అప్లోడ్ చేశారు. ఈ విషయమై సర్పంచ్ నక్కా అనురాధ కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తులు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయాలని సర్పంచ్ కోరారు.