News September 11, 2025

రాజమండ్రి: ఈ నెల 12న ఉద్యోగ మేళా

image

తూ.గో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణం వద్ద ఈనెల 12న జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి 19 నుంచి 30 సంవత్సరాలలోపు వయసుగల వారు అర్హులని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 11, 2025

‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఎక్కిన దివాన్ చెరువు కుర్రోడు

image

రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన సూక్ష్మ కళాకారుడు బబ్లు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు. 5 లక్షల బియ్యం గింజలతో ప్రేమానంద్ మహారాజ్ చిత్రాన్ని వేసి ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటికే 2 లక్షల ధాన్యం గింజలతో బాలాజీ చిత్రాన్ని వేసి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకున్నాడు. బబ్లు తండ్రి పానీపూరీ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

News September 11, 2025

చట్ట వ్యతిరేక శక్తులపై ఎస్పీ సీరియస్

image

పోలీసులపై దాడి చేసిన ఘటనను ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో చట్ట వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన తర్వాత జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 90 వాహనాలపై కేసులు నమోదు చేశారు. 23 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 110 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయి.

News September 10, 2025

రాజమండ్రి: నేపాల్ బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

నేపాల్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎవరైనా అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లయితే, వారి వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బుధవారం కోరారు. అటువంటి వారికి సహాయం అందించేందుకు రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. అవసరమైనవారు 8977935611 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆమె కోరారు.