News April 2, 2024
రాజమండ్రి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నేపథ్యం ఇదే..

రాజమండ్రి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ అధిష్ఠానం మంగళవారం ఖరారు చేసింది. అమలాపురం ప్రాంతానికి చెందిన రుద్రరాజు కాంగ్రెస్‌లో సీనియర్ నేత. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. YS షర్మిల రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యే వరకూ ఆయనే కొనసాగారు. అనంతరం 2024 జనవరి 16న రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.
Similar News
News October 1, 2025
గ్రామ స్థాయిలో GST సూపర్ సేవింగ్స్ పై ప్రచారం తప్పనిసరి: కలెక్టర్

సెప్టెంబర్ 22 నుంచి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన GST – సూపర్ సేవింగ్స్ పై గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం జరగాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడారు. సంబంధిత అధికారులు అక్టోబర్ 19 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లోకి వెళ్లి తగ్గించిన ధరల లభ్యతపై స్పష్టత కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీలు చేయాలన్నారు.
News October 1, 2025
వైద్య సేవలకు ఆటంకం లేకుండా చర్యలు: కలెక్టర్

రాజమండ్రి: పీహెచ్‌సీలలో వైద్య సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు పీజీ వైద్యులు, ఇతర డాక్టర్లను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు నిరంతరాయ వైద్య సేవలు అందించేందుకు జిల్లా స్థాయి యంత్రాంగం సమన్వయంతో వైద్య ఆరోగ్య అధికారులు పని చేస్తున్నారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
News October 1, 2025
గాడాల: దళితుడిపై దాడి ఘటనపై ఎస్పీ సీరియస్

కోరుకొండ మండలం గాడాలలో దళిత యువకుడిపై దాడి ఘటనలో ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్ అయ్యారు. మధురపూడికి చెందిన పాముల శ్రీనివాస్ అనే వ్యక్తిపై గత రాత్రి ఇద్దరు తీవ్రంగా దాడి చేయడంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణ అధికారిగా డీఎస్పీని నియమించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ దాడి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.