News February 1, 2026
రాజమండ్రి కార్పొరేషన్‌కు జాతీయ అవార్డు

రాజమండ్రి నగరపాలక సంస్థకు జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. అకౌంటింగ్ సంస్కరణల ప్రమోషన్‌లో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాజమండ్రికి ఈ అవార్డు దక్కింది. గ్రేటర్ నోయిడాలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 3, 2026
రాజానగరంలో మెగా జాబ్ మేళా

రాజానగరం ZP ఉన్నత పాఠశాలలో ఈనెల 8న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు MLA బత్తుల బాలరామకృష్ణ మంగళవారం తెలిపారు. ఇందులో 60 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని 3000 మందికి ఉపాధి కల్పిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News February 3, 2026
పొగాకు రైతులకు శుభవార్త

పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అన్ మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుపై ఉన్న 18 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఇటీవల రాజమండ్రి MP పురందీశ్వరి రైతులతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి సుంకం ఎత్తివేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పొగాకు రైతులకు భారీ ఊరట లభించనుంది.
News February 3, 2026
తూ.గో: స్కూల్ ఆటోలపై రవాణా శాఖ కొరడా

తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తున్న 11 ఆటోలపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అందులో 7 ఆటోలను సీజ్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో పరిమితికి మించి పిల్లలను తరలిస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా డ్రైవర్లు నియమాలు పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


