News September 7, 2025

రాజమండ్రి: కేసుల దర్యాప్తుకు కొత్త జాగిలాలు

image

కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపులో పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త జాగిలాలు వచ్చినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ తెలిపారు. ఈ నూతన జాగిలాల చేరికతో దర్యాప్తు మరింత శక్తివంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ‘రాడో’ అనే జాగిలం శిక్షణ కాలంలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం సాధించిందని ప్రశంసించారు. డాగ్ హ్యాండ్లర్ల కృషిని ఆయన అభినందించారు.

Similar News

News September 7, 2025

ధవలేశ్వరం: తగ్గుముఖం పట్టిన వరద

image

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శనివారం రాత్రి 9 గంటలకు 7,38,035 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 14,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 6, 2025

అల్లు అరవింద్‌ను పరామర్శించిన జక్కంపూడి రాజా

image

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ను రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా శనివారం హైదరాబాద్‌లో పరామర్శించారు. ఇటీవల అరవింద్ తల్లి కనకరత్నం మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జక్కంపూడి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News September 6, 2025

మిథున్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యేలు

image

మధ్యంతర బెయిల్‌పై శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జగ్గిరెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, ఇతర జిల్లా ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.