News August 13, 2025

రాజమండ్రి: గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు గమనిక

image

రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలో ఇప్పటికీ తమ ఇంటి నిర్మాణం పూర్తి చేయని వారు తక్షణమే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ పి.ప్రశాంతి బుధవారం సూచించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్నవారు, అదనపు ఆర్థిక సహాయం (AFA) పొందిన లబ్ధిదారులు గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 15, 2026

రాజమండ్రి: గమనిక.. రేపు రెవెన్యూ క్లినిక్‌లు రద్దు

image

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తదుపరి రోజూ 16న రాష్ట్ర ప్రభుత్వం ఐచ్చిక సెలవు ప్రకటించిన దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన PGRS/ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు అందజేయడానికి సంబంధిత కార్యాలయాలకు రావద్దని అర్జీదారులను కోరారు. తదుపరి సోమవారం నుండి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.

News February 14, 2026

ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: కందుల

image

సీఎం నారా చంద్రబాబు దిశానిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక బడ్జెట్ రాష్ట్ర పురోగతికి బాటలు వేసేలా ఉందని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. శనివారం అమరావతిలో ఆయన మాట్లాడారు. పర్యాటక, సాంస్కృతిక రంగాలకు బడ్జెట్‌లో రూ.439 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది సమగ్రమైన బడ్జెట్ అని రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి పురోగమన దిశలో వెళ్తుందన్నారు.

News February 13, 2026

తూ.గో జిల్లాలో ఈనెల 17న డీ-వార్మింగ్ డే- డీఎంహెచ్‌ఓ

image

తూర్పుగోదావరి జిల్లాలోని అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ నెల 17న జాతీయ డీ-వార్మింగ్ డే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ రోజు మాత్రలు వేసుకోలేని వారి కోసం 24న ‘మాప్-అప్ డే’ ఏర్పాటు చేశామన్నారు. వయసును బట్టి ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని, పిల్లలకు ఆహారం తిన్న తర్వాతే వీటిని వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.