News April 12, 2025

రాజమండ్రి: చిన్నారికి ప్రముఖుల ప్రశంస

image

రాష్ట్రాలు వాటి రాజధానులు, 16 జాతీయ చిహ్నాలు, 7 ఖండాలు సునాయాసంగా చెప్పి అంతర్జాతీయ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సాధించిన చిన్నారి దొంతలా నిషిత శివన్‌‌ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ అభినందించారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మున్సిపల్‌ కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆ చిన్నారిని అభినందించారు.

Similar News

News April 13, 2025

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గిరిపుత్రిక

image

అల్లూరి జిల్లా పీఎం కోట గ్రామానికి చెందిన కదల నారాయణరెడ్డి, వెంకట లక్ష్మి కుమార్తె హరిచందన ఇంటర్ ఫలితాల్లో 981 మార్కులతో జిల్లాలోనే ఉన్నత స్థానంలో నిలిచింది. వై రామవరంలోని పి. ఎర్రగొండ ఏపీఆర్ కాలేజీ నుంచి ఈ ప్రతిభ కనబరిచింది. గత పదవ తరగతి ఫలితాల్లో కూడా జిల్లాలో టాప్‌లో ఉండడం గమనార్హం. తమ కష్టం ఎంతోమంది గిరిజనులకి ప్రేరణ నిస్తుందని, బంధువులు, గ్రామస్థులు, ఏజెన్సీ వాసులు అభినందనలు తెలిపారు.

News April 12, 2025

రాజమండ్రి: ఇంటర్ స్టేట్ టాపర్లను అభినందించిన మంత్రి దుర్గేష్

image

ఇంటర్ ఫలితాలలో స్టేట్ టాప్ ర్యాంక్ లను సాధించిన విజేతలను మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. రాజమండ్రిలో శనివారం జరిగిన కార్యక్రమంలో తన అంధత్వాన్ని ఎదురించి హెచ్ఇసీ సోషల్ స్టడీస్ లో 955 /1000 మార్కులు సాధించిన షేక్ ఫర్జానాను ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక అల్కాట్ గార్డెన్స్ లో ఇంటర్ విద్యార్థులను అభినందించారు

News April 12, 2025

తూ.గో. జిల్లాకు 4వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో తూ.గో.జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 17,575 మంది పరీక్షలు రాయగా 15,362 మంది పాసయ్యారు. 87 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో.జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 20,083 మందికి 15,529 మంది పాసయ్యారు. 77శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 5వ స్థానంలో తూ.గో.జిల్లా నిలిచింది.

error: Content is protected !!