News April 17, 2025

రాజమండ్రి: ‘జనరల్ వార్డుల్లోనే ప్రసవాలు జరగడం శోచనీయం’

image

స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేని దయనీయ స్థితిలో ఉందని మాజీ ఎంపీ భరత్ రామ్ విమర్శించారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ హయాంలో అన్ని వసతులు కల్పించడం వల్లే వైద్య సేవలు పేదలకు మరింత చేరువ అయ్యాయన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఆపరేషన్ థియేటర్లలో కాకుండా జనరల్ వార్డులలోనే ప్రసవాలు జరగడం దురదృష్టకరమన్నారు.

Similar News

News August 18, 2025

తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

News August 17, 2025

తూ.గో: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మ.1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు తమ అర్జీలను అందజేయొచ్చన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గూర్చి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

News August 17, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. వర్షాల కారణంగా పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పంటల రక్షణ కోసం శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని కలెక్టర్ సూచించారు.