News August 26, 2025
రాజమండ్రి: జిల్లా పరిశ్రమల ప్రగతికి సింగిల్ డెస్క్ విధానం

జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించే క్రమంలో ఔత్సాహిక పారిశ్రామిక వ్యవస్థాపకులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి కోసం సింగిల్ డెస్క్ విధానం ఉందన్నారు.
Similar News
News September 25, 2025
తూ.గో: హోమ్ స్టేలను ప్రోత్సహించండి: కలెక్టర్

తూ.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి హోమ్ స్టేలను ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికలు రచించాలని ఆదేశించారు.
News September 24, 2025
రాజమండ్రి సెంట్రల్ జైలు తనిఖీ

రాజమండ్రి సెంట్రల్ జైలును బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం బుధవారం సాయంత్రం సందర్శించింది. ఈ బృందంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా న్యాయసేవాధికారి కార్యదర్శి ఎన్. లక్ష్మి, ఎస్పీ నరసింహ కిషోర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు జైల్లో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను, వారు ఉండే బ్యారక్‌లను పరిశీలించారు.
News September 24, 2025
అక్టోబర్ 15న తూర్పు గోదావరి రెడ్‌క్రాస్ ఎన్నికలు

రాజమండ్రి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు అక్టోబరు 15న నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఈ ఎన్నికలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం ఉన్న పేట్రన్, వైస్ పేట్రన్, లైఫ్ మెంబర్స్ ఈ ఎన్నికలకు హాజరు కావాలని సూచించారు.