News March 29, 2025
రాజమండ్రి: తప్పిన పెను ప్రమాదం..41 మంది సేఫ్

ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. గోకవరం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం భద్రచలం నుంచి రాజమండ్రికి బయలుదేరింది. బస్సు కూనవరం ఘాటీలో దుర్గమ్మ గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా బ్రేక్ ఫెయిలయ్యింది. గమనించిన డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలువరించాడు. బస్సులో ప్రయాణిస్తున్న 41 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ను ప్రయాణీకులు అభినందించారు.
Similar News
News August 17, 2025
తూ.గో: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మ.1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు తమ అర్జీలను అందజేయొచ్చన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గూర్చి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
News August 17, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. వర్షాల కారణంగా పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పంటల రక్షణ కోసం శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని కలెక్టర్ సూచించారు.
News August 17, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమం ఈ నెల 18 సోమవారం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రాల కార్యాలయాల్లోనే అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.