News February 11, 2026
రాజమండ్రి: తిట్టిన వారికి సెంట్రల్ జైలా?

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, కురసాల కన్నబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ.. “కొట్టిన వారికి స్టేషన్ బెయిలు, తిట్టిన వారికి సెంట్రల్ జైలు” అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందిస్తూ.. తప్పు జరిగినట్లు తేలితే ‘దైవ ద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 17, 2026
రాజమండ్రి: టెన్త్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి- డీఆర్ఓ

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్‌లో పబ్లిక్ పరీక్షలపై సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డీఆర్ఓ టి. సీతారామ మూర్తి దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని డిఆర్ఓ సూచించారు.
News February 17, 2026
వికసిత్ భారత్‌కు బడ్జెట్-2026 బలమైన పునాది: పురందేశ్వరి

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర బడ్జెట్-2026 దీర్ఘకాలిక పునాది వేస్తుందని ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న దేశాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
News February 17, 2026
JEE మెయిన్స్‌లో ‘తిరుమల’ విద్యార్థుల జయకేతనం

JEE MAIN 2026 సెషన్-1 ఫలితాలలో రాజమహేంద్రవరంలోని TIRUMALA IIT & అండ్ మెడికల్ విద్యార్థి డి.శ్రీవేద్ 99.999 పర్సంటైల్ సాధించారు. SC కేటగిరిలో శ్రీవేద్ ఆలిండియా టాపర్‌గా నిలిచారని TIRUMALA విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. అలాగే ఎం.కృష్ణ శరవణ సాకేత్ 99.99, జీ.వాత్సల్యకు 99.98, ఆర్.చరణ్ తేజ 99.98 పర్సంటైల్ సాధించారన్నారు. ఉత్తమ స్కోర్లను సాధించినవారిని ఆయన అభినందించారు.


