News October 12, 2024
రాజమండ్రి: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల

రాష్ట్ర ప్రజలకు మంత్రి కందులు దుర్గేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెడుపై చివరికి మంచే గెలుస్తుందని గుర్తుచేసే రోజు విజయదశమి అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 12, 2025
“తూర్పు” కలెక్టర్ కీర్తి చేకూరికి 13వ ర్యాంకు

తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తన పని తీరుతో ఎపీలో 13వ ర్యాంక్ పొందారు. గత 3 నెలల వ్యవధిలో కలెక్టర్లు పరిశీలించిన ఫైళ్ల క్లియరెన్స్ విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం గ్రేడ్స్ ప్రకటించింది. ఇందులో తూర్పు కలెక్టర్ కీర్తి.. ఫైల్ పరిశీలనకు సగటున 1 రోజు 21 గంటల సమయం తీసుకున్నారు. కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ 21, కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ 26వ స్థానాల్లో నిలిచారు.
News December 12, 2025
రాజమండ్రి: 9 రైస్ మిల్లర్లకు షోకాజ్ నోటీసులు

తూ. గో జిల్లాలో ఖరీఫ్ 2024–25 ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అనధికార వసూళ్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై 9 రైస్ మిల్లర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు జేసీ మేఘా స్వరూప్ ప్రకటించారు. అనపర్తి, బిక్కవోలు, చాగల్లు, కడియం, కోరుకొండ మండలాలకు చెందిన మొత్తం 9 రైస్ మిల్లులు అనధికార వసూళ్ల ఆరోపణలపై ధాన్యం/రైస్ అలాట్‌మెంట్ నిలిపివేత, మిల్లులను బ్లాక్‌లిస్ట్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు
జేసీ తెలిపారు.
News December 12, 2025
రాజమండ్రి: టెట్ పరీక్షకు 1,805 మంది హాజరు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండవ రోజు ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు తెలిపారు. స్థానిక లూధర్ గిరిలో గల రాజీవ్ గాంధీ కళాశాలలో మొదటి షిఫ్ట్‌లో 955 మందికిగాను 907 మంది హాజరయ్యారని, 48 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం షిఫ్ట్‌లో 955 మందికి 898 మంది హాజరవగా.. 57 మంది గైర్హాజరైనట్టు డీఈవో తెలిపారు


