News November 8, 2025

రాజమండ్రి: నేడు యథావిధిగా పాఠశాలలు

image

జిల్లాలో రెపు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని డీఈఓ వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలకు ప్రభుత్వం అక్టోబర్ నెల 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సెలవుల స్థానంలో వీటిని భర్తీ చేస్తున్నామన్నారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 14 రెండవ శనివారాల్లో పాఠశాలలు విధిగా పనిచేయాలని విద్యాశాఖ ఆదేశించినట్లు డీఈవో చెప్పారు.

Similar News

News November 8, 2025

ముంపు నివారణ చర్యలపై సమగ్ర ప్రణాళిక అవసరం: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో ఇటీవల వరదలు, అధిక వర్షాల కారణంగా ప్రభావితమైన గ్రామాలలో ముంపు పరిస్థితులు పునరావృతం కాకుండా సమగ్ర నివారణ చర్యలు అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఇరిగేషన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాను వల్ల పలు గ్రామాల్లో పంటలు ముంపుకు గురై రైతులు నష్టపోయారని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 7, 2025

గోపాలపురం: కొడవలితో భార్యపై భర్త దాడి

image

భార్యపై అనుమానంతో భర్త కొడవలితో దాడి చేసిన ఘటన గోపాలపురం మండలం దొండపూడి మేదరపేటలో జరిగింది. ఎస్‌ఐ మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సింధూజపై అనుమానం పెంచుకున్న ఆమె భర్త కాసాని రామకృష్ణ మద్యం మత్తులో వచ్చి దాడి చేశాడు. సింధూజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

News November 7, 2025

డిజిటల్ సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

తూ.గో. జిల్లా వ్యాప్తంగా ‘మన మిత్ర’ వాట్సాప్‌ ఆధారిత సేవలపై శుక్రవారం నుంచి డోర్‌ టు డోర్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సాప్‌ సేవల డెమో, క్యూఆర్‌ కోడ్‌ పంపిణీ, పాంప్లెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ప్రతి ఇంటిని కవర్‌ చేసి, నమోదు అయిన కుటుంబాల వివరాలను రికార్డు చేయాలని కలెక్టర్‌ సూచించారు.