News December 22, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం PGRS నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.
Similar News
News December 29, 2025
రాజానగరంలో రేపు ‘జాబ్ మేళా’

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 30 మంగళవారం రాజానగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ స్కిల్ హబ్ ప్రాంగణంలో ఉదయం 10:30 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 19 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండి.. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.
News December 29, 2025
యథావిధిగా ‘జిల్లాలో మీ కోసం’: కలెక్టర్

ఈ నెల 29న ‘జిల్లాలో మీ కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదికను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబరు, 9552300009 వాట్సప్ సేవల ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.