News December 22, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం PGRS నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.
Similar News
News December 23, 2025
ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈసీ మెంబర్‌గా దత్తుడు

కొవ్వూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకుడు ఎంబీఎస్ ప్రసాద్(దత్తుడు) ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కర రావు నుంచి నియామక ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. దత్తుడు గతంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కొవ్వూరు రైస్ అండ్ కిరాణా మధ్యంత అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
News December 22, 2025
తూ.గో. ఎస్పీ నరసింహ కిషోర్‌కు DGP బ్రాంజ్ డిస్క్ అవార్డు

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ DGP బ్రాంజ్ డిస్క్ అవార్డును దక్కించుకున్నారు. డీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారుల సేవలను గుర్తించి సిల్వర్, బ్రోన్జ్ డిస్క్ అవార్డులను ప్రకటించారు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, కడియం ఎస్సై బి.నాగ దుర్గాప్రసాద్, సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీకి పోలీసు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
News December 22, 2025
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అమర్జహే బెగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన అమర్జహ బేగ్ మహమ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


