News December 19, 2025
రాజమండ్రి: పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి- DMHO

ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని DMHO డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఒక విడత పోలియో చుక్కలు వేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టగా, ఇందుకు 2,31,250 డోసుల పోలియో వ్యాక్సిన్ సిద్ధం చేశామన్నారు.
Similar News
News December 19, 2025
రేపు పెరవలికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఉదయం 9:20 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:50 గంటలకు పెరవలి చేరుకుంటారు. రూ.3,040 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి మంగళగిరి బయలుదేరుతారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
News December 19, 2025
తూ.గో జిల్లాలో ఉద్యోగాలు.. 12 రోజులే గడువు!

రాజమండ్రిలోని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఛీఫ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జీ సునీత శుక్రవారం తెలిపారు. అర్హత కలిగిన న్యాయవాదులు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలు జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
News December 19, 2025
రేపు పాఠశాలలో ‘ముస్తాబు’- కలెక్టర్

‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం(డిసెంబర్ 20న) జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా ఒక ప్రత్యేక అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలల సుందరీకరణలో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఆమె వివరించారు.


