News February 6, 2025
రాజమండ్రి: పవన్ కల్యాణ్ కోసం జన సైనికుల పూజలు
అస్వస్థతకు గురైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కల్యాణ్‌కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ గురువారం జనసేన నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి దేవీచౌక్‌లోని శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి, శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు, ప్రార్థనలు చేశారు. జనసేన నాయకులు సూర్య బయ్యపునీడి, విక్టరీ వాసు, చక్రపాణి, విన్నా వాసు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. తూ.గో. జిల్లా మంత్రి కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.
News February 6, 2025
రాజానగరం: పోలీసులను ఆశ్రయించిన మైనర్ బాలిక
16 ఏళ్ల బాలిక 18 యువకుేడిపై రాజానగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజానగరానికి చెందిన మైనర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. బాలుడు పాఠశాలలలో చదువుతున్న రోజుల నుంచి ఆమెను ప్రేమించి మాయ మాటలతో లోబరుచుకున్నాడు. బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ముఖం చాటేశాడు. న్యాయం కోసం ఆ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్సీ శ్రీకాంత్ పోక్సో కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 6, 2025
తూ.గో జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) 2025 సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పి. గిరి ప్రసాద్ వర్మ, జిల్లా అధ్యక్షుడు సీహెచ్. విల్సన్ పాల్, జిల్లా కార్యదర్శి, పలువురు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.