News December 18, 2024
రాజమండ్రి: పోలీసులపై దాడి.. అరెస్టు

పోలీసులపై దాడి చేసిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేశ్ బాబు కథనం మేరకు.. రాజమండ్రిలో శ్రీకాకుళం పోలీసులపై దాడి చేసి.. రాపాక ప్రభాకర్‌ను తీసుకువెళ్లిన నిందితులను అరెస్టు చేశామన్నారు. దాడి చేసిన వారిలో భీమవరానికి చెందిన శ్రీకాంత్, వినోద్, రాజు, మహంకాళి, క్రాంతి, మొగల్తూరుకి చెందిన కామరాజుతో పాటు రాజమండ్రికి చెందిన మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు
Similar News
News February 27, 2026
పెన్షన్‌దారులకు శుభవార్త.. ఒకరోజు ముందుగానే ‘సామాజిక భరోసా’

మార్చి నెల ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే, ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారుల సౌకర్యార్థం ఫిబ్రవరి 28వ తేదీ(శనివారం) నాడే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
News February 27, 2026
కల్తీ పాలు, కలుషిత జలాల ఘటనలపై CM సమీక్ష

CM చంద్రబాబు గురువారం అమరావతి నుంచి తూ.గో, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ పాలు, కలుషిత జలాల పరిస్థితిపై క్షేత్రస్థాయి సమీక్ష జరిపారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, MLA తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశాల్లో నిర్లక్ష్యం వహించవద్దని CM స్పష్టం చేశారు.