News March 25, 2024
రాజమండ్రి: ‘ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి’

రాజకీయ పార్టీలు కచ్చితంగా ఎన్నికల నిబంధనలను పాటించాలని రూరల్ నియోజకవర్గ ఆర్వో తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షోలు, ర్యాలీలు, సభలు, మైక్‌లో ప్రచారం చేసుకునే విషయంలో 48 గంటల ముందుగా ఎన్నికల అధికారి నుండి అనుమతి తీసుకోవాలన్నారు. అందుకోసం సువిధ యాప్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలు ఆర్వో కార్యాలయంలో అందచేయాలని పేర్కొన్నారు.
Similar News
News April 14, 2025
కోరుకొండ కొండపై నుంచి రోప్‌వేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఐదు ప్రాంతాల్లో రోప్‌వేలకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసే వాటిలో కోరుకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందు నుంచి శిఖరాగ్రం వరకూ 0.25 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అనుమతి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News April 14, 2025
రాజమండ్రి: ప్రజలకు ఎస్పీ సూచనలు

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు జయంతి పండగ ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
News April 13, 2025
కోరుకొండ: పొట్ట కూటి కోసం వెళ్లి విగతజీవులుగా మారారు.

కోరుకొండ(M) కాపవరంలో నిన్న రైలు మిల్లులో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే వారు పొట్ట కూటి కోసం వెళ్లి విగతజీవులుగా మారారు. ప్రమాదంలో మరణించిన శ్రీరామ్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు రెక్కాడితే కాని డొక్కాడని రైతు కూలీలు. డైలీ రైస్ మిల్లుకు వెళ్లి లారీ నుంచి ధాన్యం బస్తాలు దింపి మిల్లుకు వేస్తుంటారు. కుటుంబంలో పెద్ద దిక్కుకుగా ఉన్నవారు చనిపోవడంతో దిక్కులేని వారయ్యారు.