News April 14, 2025
రాజమండ్రి: ప్రజలకు ఎస్పీ సూచనలు

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు జయంతి పండగ ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
Similar News
News April 15, 2025
డ్రోన్లతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

తూ.గో.జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు డ్రోన్లతో ప్రత్యేక నిఘాను పటిష్ఠం చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
News April 15, 2025
RJY: మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ

తూ.గో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కే.వీ. సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 991 బ్యాచ్‌కు చెందిన ఆయిన ఉమ్మడి తూ.గో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో సీఐ గా, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీగా, రాజమండ్రి అడిషనల్ డీఎస్పీగా, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా, పరవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఎపీ పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు, బదిలీపై ఇక్కడికి వచ్చారు.
News April 14, 2025
విజ్జేశ్వరం: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు గల్లంతు

సీతంపేట సమీపంలోని విజ్జేశ్వరం – మద్దూరు లంక బ్యారేజ్ దగ్గర సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నిడదవోలుకు చెందిన మత్తి ప్రకాష్ కుమార్ (15), రాజమండ్రికి చెందిన గంధం హర్ష (20) నదిలో గల్లంతయ్యారని విషయం తెలుసుకొని ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్,ఎస్పీలతో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.