News February 16, 2025

రాజమండ్రి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలి-మాజీ ఎంపీ

image

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక యువకుడి ప్రాణాలు పోయాయని మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ధ్వజమెత్తారు. స్థానిక గోరక్షణ పేట దగ్గర వాటర్ వర్క్స్ మరమ్మతుల నిమిత్తం రోడ్డుకు అడ్డంగా భారీ పైపు వేసి, రోడ్డు డైవర్షన్ కూడా పెట్టలేదన్నారు. దీంతో బైక్‌పై వెళ్తున్న విజయ్ అనే యువకుడు అర్ధరాత్రి పైపును ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 29, 2025

మంత్రితో సినీ దర్శకుల భేటీ.. పరిశ్రమ అభివృద్ధిపై చర్చలు!

image

విజయవాడలో పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అసోసియేషన్ బలోపేతం, సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పరిశ్రమ పురోభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.

News December 29, 2025

చినవెంకన్న సన్నిధిలో ముక్కోటికి ముస్తాబు.. MLA, కలెక్టర్ పరిశీలన

image

చినవెంకన్న క్షేత్రంలో మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను MLA మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కిషోర్‌తో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, మంచినీరు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని MLA పేర్కొన్నారు.

News December 29, 2025

ఈనెల 30న కలెక్టరేట్‌లో వర్క్ షాప్: జేసీ

image

నూతన ఆవిష్కరణల ద్వారా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లను బలోపేతం చేసేందుకు ఈనెల 30న బొమ్మూరు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు జేసీ మేఘా స్వరూప్ తెలిపారు. నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC), RTIH సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వాణిజ్యీకరణ వంటి కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని జేసీ పేర్కొన్నారు.