News July 9, 2025
రాజమండ్రి ప్రభుత్వ సంగీత పాఠశాల ప్రిన్సిపల్‌గా శ్రీనివాస శర్మ

రాజమండ్రిలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపల్‌గా పసుమర్తి శ్రీనివాస శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన కుమారి మండపాక నాగలక్ష్మి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు పదోన్నతిపై బదిలీ అయ్యారు. శ్రీనివాస శర్మ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News July 10, 2025
‘కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయి’

మహారాష్ట్రకు చెందిన కేంద్ర రైల్వే మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత శ్రీరామ్ సాహెబ్ దాన్వే బుధవారం కడియం మండలం కడియపులంకలోని శ్రీ సత్య దేవ నర్సరీని సందర్శించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సరీకి విచ్చేసి పలు రకాల మొక్కలను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
News July 10, 2025
నేడు మెగా పేరెంట్, టీచర్ మీట్

గోపాలపురం మండలంలో నేడు మెగా పేరెంట్, టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాజంపాలెం, కొవ్వూరుపాడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సమావేశం జరుగుతుందని, ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సమస్యలను, సలహాలను ఈ మీట్‌లో పంచుకోవచ్చని అధికారులు సూచించారు.
News July 10, 2025
ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: జక్కంపూడి

కాకినాడ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 14వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బుధవారం ప్రకటించారు. పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులకు సుమారు రూ.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కార్మికుడు సంగీతం సత్యనారాయణ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని రాజా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.