News September 21, 2025

రాజమండ్రి: ‘ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టండి’

image

ప్రజల్లో సంతృప్తి చెందేలా ప్రాధాన్యత క్రమంలో నగరంలో అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాధిపతులతో శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత నగరంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులపై ఆరా తీశారు. మొదటి దశలో చేపట్టిన 15 రహదారుల విస్తరణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.

Similar News

News September 21, 2025

రాజమండ్రి: 22న యథావిధిగా మీకోసం కార్యక్రమం

image

రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా ‘మీకోసం కార్యక్రమం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలు Meekosam.ap.gov.in లో నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి తెలుసుకోవడానికి 1100 నంబరుకు కాల్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News September 20, 2025

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

image

తూ.గో జిల్లా యువ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ కప్ – 2025లో సాధించిన విజయంపై కలెక్టర్ కీర్తి చేకూరి అభినందనలు తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో క్రీడాకారులు కలెక్టర్‌ను కలుసుకొని, తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు గౌరవం తీసుకొచ్చిన మీరంతా ఇతరులకు ఆదర్శం, మీ కృషి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

News September 20, 2025

తూ.గో జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర

image

తూ.గో జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎప్సీ నరసింహ కిషోర్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టామని సిబ్బంది తెలిపారు. తొలుతు పోలీస్ స్టేషన్ ఆవరణాలను శుభ్రం చేశారు. చెత్తచెదారాలు, పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు చెప్పారు.